కీర్తనలు 99

1యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో వణకాలి. కెరూబు దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది. 2సీయోనులో యెహోవా గొప్పవాడు. ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు. 3ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు. 4శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు. 5మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పాదపీఠాన్ని ఆరాధించండి. 6మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారికి జవాబు యిచ్చాడు. 7ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. 8మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు. 9మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.


Copyright
Learn More

will be added

X\