కీర్తనలు 98

1యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది. 2యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు. 3ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు. 4భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి. 5స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. 6బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. 7భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి. 8నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. 9యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

will be added

X\