కీర్తనలు 93

1యెహోవాయే రాజు! ప్రభావము, బలము, ఆయన వస్త్రములవలె ధరించాడు. కనుక ప్రపంచం నాశనం చేయబడదు. 2దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి. 3యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి, 4పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు. 5యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు నిలిచి ఉంటుంది.

will be added

X\