కీర్తనలు 87

1యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు. 2ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం. 3దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబతారు. 4దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబలోనులోను జీవిస్తున్నారు. ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది. 5సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు. 6దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు. ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు. 7దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు. దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.


Copyright
Learn More

will be added

X\