కీర్తనలు 82

1దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు. 2ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు. 3“అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపాడండి. 4పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి. 5“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వారు గ్రహించరు. వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.” 6నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. 7కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు. ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.” 8దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.


Copyright
Learn More

will be added

X\