WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

కీర్తనలు 8 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.   2  పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.   3  యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.   4  మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు?   5  అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.   6  నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు.   7  గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.   8  ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.   9  మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!