WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

కీర్తనలు 57 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.   2  మహోన్నతుడైన దేవునికి సహోయం కోసం నేను ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.   3  పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు. నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన ఓడిస్తాడు. దేవుడు తన నిజమైన ప్రేమను నాకు చూపిస్తాడు.   4  నా జీవితం ప్రమాదంలో ఉంది. నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు. ఈటెలు, బాణాలు వంటిపదునైన పళ్లు, ఖడ్గంలా పదునైన నాలుకలుగల మనుష్యులను తినే సింహాల్లా వారున్నారు.   5  దేవా నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు. నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.   6  నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు. వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు. నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు. కాని వారే దానిలో పడ్డారు.   7  దేవా, నిన్ను విశ్యసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది. నేను ఆయనకు స్తుతులు పాడుతాసు.   8  నా ఆత్మ, మేలుకోనుము! స్వరమండలమా, సితారా, మేలుకోండి వేకువను మనం మేల్కొందాము   9  నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను. ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.   10  నీ నిజమైన ప్రేమ ఆకాశంలో కెల్లా అత్యున్నత మేఘాలంకంటె ఎత్తయింది.   11  ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు. ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.