WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

కీర్తనలు 5 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  యెహోవా, నా మాటలు ఆలకించుము. నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్న దాన్ని వినుము.   2  నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము.   3  యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను. సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను. మరి నీవు నా ప్రార్థనలు వింటావు.   4  యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర వుండడానికి ఇష్టపడవు చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.   5  గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు. ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.   6  అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు. ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.   7  యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు. యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.   8  యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు. కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము. నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో అది నాకు తేటగా చూపించుము.   9  ఆ మనుష్యులు సత్యం చెప్పరు. వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు. వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి. ఆ మనుష్యులు ఇతరులకు చక్కనిమాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.   10  దేవా! వారిని శిక్షించుము. వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము. ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.   11  అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము. ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.   12  యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.