కీర్తనలు 47

1సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. 2మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. 3ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. 4దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. 5బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు. 6దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. 7దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. 8దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు. 9రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు.

will be added

X\