కీర్తనలు 43

1దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము. నా వివాదం నాలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. ఆ మనుష్యులు అబద్ధాలు చెబతున్నారు. ఆ ప్రజలు వంకర మనుష్యులు. దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము. 2దేవా, నీవే నా క్షేమ స్థానం. నీవు నన్నెందుకు విడిచిపెట్టావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి? 3దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము. నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము. 4దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. దేవుని దగ్గరకు నేను వస్తాను. ఆయన నన్ను సంతోషింపజేస్తాడు. దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను. 5నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను? దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి. నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. నా దేవుడే నాకు సహాయము.


Copyright
Learn More

will be added

X\