1 యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి! 2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటికోసం ఆయనను స్తుతించండి! 3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! 4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి! 5 పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి! 6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి.