WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

కీర్తనలు 130 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.   2  నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.   3  యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు.   4  యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.   5  యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.   6  నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.   7  ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.   8  మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.