కీర్తనలు 127

1ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసికొంటున్నట్టే. 2నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే నీవు నీ సమయం వృదా చేనుకొంటున్నట్టే. దేవుడు తనకి ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు. 3పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం. 4యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటి వారు. 5తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.


Copyright
Learn More

will be added

X\