కీర్తనలు 126

1యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి తిరిగి వెసుకకు తీసకొనివచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది! 2మేము నవ్వుకుంటున్నాము. మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలు పెట్టే వాళ్లము. “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.” 3ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పు కొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్మాము! 4యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము. ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము. 5విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా వుండవచ్చు, కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు. 6అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.


Copyright
Learn More

will be added

X\