కీర్తనలు 123

1దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు. 2బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడుతాము. దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురు చూస్తాము. 3యెహోవా, మా మీద దయ చూపించుము. మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము. 4ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.


Copyright
Learn More

will be added

X\