1 కొండల తట్టు నేను చూసాను. కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది? 2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది. 3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. 4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. దేవుడు ఎన్నడూ నిద్రపోడు. 5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు. 6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు. 7 ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.