WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

కీర్తనలు 114 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.   2  ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది.   3  ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.   4  పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి. కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.   5  ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?   6  పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?   7  యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.   8  బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.