కీర్తనలు 113

1యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! యెహోవా నామాన్ని స్తుతించండి. 2ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 3తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 4యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం. 5ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు. 6ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి. 7దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు. 8ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు. 9ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!


Copyright
Learn More

will be added

X\