కీర్తనలు 111

1యెహోవాను స్తుతించండి! మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో నేను నా హృదయ పూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను. 2యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి. 3దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది. 4దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక యెహోవా దయ, జాలిగలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము. 5దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు. 6దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి. 7దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా. ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి. 8దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి. 9దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు. దేవుని నామం అద్భుతం, పవిత్రం! 10దేవుడంటే భయము, భక్తివుంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది. దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు. శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

will be added

X\