కీర్తనలు 108

1దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగానున్నది. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయించుటకు సిద్ధంగా ఉన్నాను. 2స్వర మండలములారా, సితారలారా మనం సూర్యున్ని మేల్కొలుపుదాం 3యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము. ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము. 4యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది. నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది. 5దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము! సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము. 6దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము. 7యెహోవా తన ఆలయము నుండి మాట్లాడి యిలా చెప్పాడు, “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను. (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను) నా ప్రజలకు షెకెమును ఇస్తాను. వారికి సుక్కోతులోయను ఇస్తాను. 8గిలాదు, మనష్షే నావి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. యూదా నా రాజ దండం. 9మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం. ఎదోము నా చెప్పులు మోసే బానిస. ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.” 10శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు? ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? 11దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం నిజమేనా? 12దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము మనుష్యులు మాకు సహాయం చేయలేరు! 13దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు. దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.


Copyright
Learn More

will be added

X\