కీర్తనలు 100

1భూమీ, యెహోవాను గూర్చి పాడుము! 2నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము. 3యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము. 4కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. ఆయనను గౌరవించండి ఆయన నామాన్ని స్తుతించండి. 5యెహోవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

will be added

X\